నీకూ నాకూ
మధ్య
నిశ్శబ్ధం లాంటి ఓపొర
సమాజపు కట్టుబాటులా!
వ్యక్తీకరణలో లోటుపాటులా!
వినాలనివుంటుంది -
చెప్పలేక కట్టిపెట్టి
నే బంధించిన ఓ భావానికి
నువు పదాలు పేరిస్తే,
దాచిపెట్టినా దాగని
నీనవ్వులోని శబ్ధానికి
మరో అర్ధం వివరిస్తే!
ఏదో ఓ రోజు
ఎదురొచ్చే ఆ క్షణం
ఎలా వస్తుందో
అనిపించే గాఢతలో
ఇప్పుడు
ఈ క్షణం ఇలా...గమ్మత్తుగా!
గతించిన కాలానికి కొనసాగింపుగా!
3 comments:
ఏం జరిగినా మంచికే అన్నట్లుగా మీ బ్లాగుని యాక్సిడెంటల్‌గా చూసినా మంచి కవిత్వం చదివాననే తృప్తి మిగిలింది. మీ రచనలు హాయిగా ఉన్నాయి. ఇది కూడా...
Thank You Vasudev garu!
ఒక్కోసారి కట్టుబాటును దాటితే తప్ప నిజమైన బాట కనిపించదు.
Post a Comment