వేకువ తాకేలోగా వెన్నెలై కురవడానికి ఎన్ని కలాలు శ్రమిస్తున్నాయో...
Thursday, August 4, 2011
ఎక్కడో చోట కురవక తప్పదు!
కొన్ని ఏకాంతాలు
అద్భుతంగా తోస్తాయి
చిన్నపాటి చిరుజల్లులా
ఆకస్మిక దాడి చేసి
ఓవిలువైన క్షణంలా తేలుతాయి...
సరిగ్గా జీవితం
అక్కడే అలాగే ఆగిపోతే
బాగుండుననిపిస్తుంది
మేఘాలు మాత్రం
ఎన్ని రహస్యాలు మోసుకెళ్ళగలవు
ఎక్కడో చోట కురవక తప్పదు!
5 comments:
"ఎక్కడో చోట కురవక తప్పదు!"
Wow! Good one!
Thank you Sowmya :-)
Been ages since I heard from you.
బావుందండి.Nice expression
అద్భుతంగా వుంది.
Thanks :-)
Post a Comment