ఆకురాలు కాలంలో
దిగులేస్తుంది
పత్రాలన్నిటినీ పరుచుకుని
చెట్టు మాత్రం
చిత్రంగా నిల్చునుంది
నేనే పరిపరివిధాల
పరుగులెడుతున్నా!
దినచర్యలో బందీనైనా
ఎండుటాకుల శబ్ధాన్నీ,
ఆకాశపు నిశ్శబ్ధాన్ని
పట్టనట్టు నేనుండలేను
అందుకే
రోజుకో రహస్యాన్ని,
అక్షరాల మీదుగా ఆనందాన్ని,
జారిపోతున్న క్షణాల్లోంచి
ఓ జరీమెరుపుని,
ఒడిసిపట్టుకోవడంలోనే
మరి ఓదార్పు .....!
2 comments:
చెట్టు అన్నీ వదిలేసి నగ్నంగా, నిర్భయంగా నిల్చున్నట్టుగా అనిపించలేదా?
అదే కదా చిత్రం మరి!
Post a Comment