ఒంటరిగా వున్నప్పుడు
వర్షం చప్పుడు విన్నావా!?
వర్తమానం అదుపు తప్పుతుంది
విరహమో! వైరాగ్యమో!
ఓ వైవిధ్యమైన భావమో!
బాల్యం గుర్తొస్తుంది
బంధం గుర్తొస్తుంది
బాధ గుర్తొస్తుంది
ప్రతి చినుకూ
వంద ఆలోచన్లగా చిందుతుంది.
ఒక సంఘటనకి ఎన్ని సంఘర్షణలు!
సందేహాలు...సమాధానాలు
వృత్తాకారంలో తిరుగుతూనే వుంటాయి
సంతృప్తి నీడల్లోనూ
ఏదోక అలజడి శబ్ధం
మిగిలిపోతూనే వుంటుంది
బహుశా అదేగాబోలు
పగటికీ,రాత్రికీ తేడా చూపేది.
ఎదురుగా వున్న ఎండుగడ్డిలో కూడా
ఏదో తెలీని అందం
వాన చుక్కలన్నీ వరస కట్టి
జారుతుంటేను!
కళ్ళ ముందున్న ఉయ్యాల
కప్పు కిందున్న నేనూ
తడుస్తూనే వున్నాము...
చినుకుదారాల్లో చిక్కుకుని.
10 comments:
తులసీ మోహన్ గారు, మీ కవితలు ఈరోజే చదవడం జరిగింది. చాలా బాగున్నాయి. మీ ఆలోచనల్ని, అనుభూతుల్ని చాలా చక్కగా మీ కవితల్లో జోడించారు. మీకు వీలైతే నా బ్లాగు:http://mytelugulyrics1.blogspot.com (పాటల పూదోట) చూసి మీ అభిప్రాయం చెప్పండి. థాంక్యూ.
తులసీ మోహన్ గారు, మీ కవితలు ఈరోజే చదవడం జరిగింది. చాలా బాగున్నాయి. మీ ఆలోచనల్ని, అనుభూతుల్ని చాలా చక్కగా మీ కవితల్లో జోడించారు. మీకు వీలైతే నా బ్లాగు:http://mytelugulyrics1.blogspot.com (పాటల పూదోట) చూసి మీ అభిప్రాయం చెప్పండి. థాంక్యూ.
anubhutini chakkagaa aksharIkarinchaaru, congrats
Wooow. Great expression and observation. I like ur way of expression very much.Keep going.:-)
అనుభవాలన్ని గుచ్చిన అక్షరాల దండా !!
ఆలోచనల్లో పురుడుపోసుకున్న్న అనుభూతుల మాల!!!
నాకు సాధారణంగా వచనకవిత్వం నచ్చదు అండి. చాలా మంది కొకిల కూసింది, వెన్నెల పూసింది, చొక్క మాసింది అని ప్రాస కలిపి కవితలు వ్రాస్తూ ఉంటారు. భావానికి ప్రాధాన్యం ఇచ్చే వచనకవిత్వమే నాకు నచ్చుతుంది. మీ వచనకవిత్వం బాగుంది. చక్కటి భావస్పష్టత ఉంది.
nuvvu palikitene kavitvam raluitundi,you have such a wounderful talent yaar ...keep going..all the best dear
charitha
excellent. I do remember my childhood. all the best
Thank you all for your valuable comments and time :-)
chala bagundi mi kavitha
Post a Comment