Sunday, September 14, 2008

చినుకులు

తెరలు తెరలుగా
పడుతూనే వున్నాయి
చినుకులు...

పూవుల్ని తాకుతూ కొన్ని,
రాళ్ళను తడుపుతూ కొన్ని,
మెరిసే ముత్యాలవుతూ మరికొన్ని,
సరాసరి ఇంకొన్ని.....

గమ్యాన్ని చేరేలోగా
గాలివాటుకి
ఎన్నెన్ని గమనాలో !

ఏ మబ్బులో మొదలైనా
మట్టిని మాత్రం
ఒకేలా పలకరింపు


విధిగా తడుస్తూ
చెట్లూ , రోడ్లూ
జ్ఞాపకాలూ .....!!

6 comments:

Anonymous said...

poralu poralu gaa
parugulu pedutunna
mabbula chaatu ninchi...

gaayaalni maaputoo konni,
aashalni reputoo konni,
virise gnaapakaala moggalavutoo marikonni,

:-)

Anonymous said...

(last line)
...vaati to paatu naa kallu

ABHIMAANI said...

వేకువ తాకేలోగా వెన్నెలై కురవడానికి ఎన్ని కలాలు శ్రమిస్తున్నాయో...

bagundi

abhinandisthu...
ABHIMAANI

Ravi Guntuku said...

Nice write ups... think about writing something on this extreme cold and snow... :-)

ఏకాంతపు దిలీప్ said...

తులసి గారు,
మంచి అనుభూతి మిగిల్చింది...

అలసిన మనసుకి, దేహానికి ఒక చల్లని ఎండాకాలపు సాయంత్రం ఏకాంతాన్ని పంచితే, ఆ సమయం కలిగించిన హాయిలో...
అప్పటికే ఎండిన మట్టిపై పడి, నేలని పులకింప చేసిన వాన చినుకులని చూసి...
ఆశ్చర్యంతో, అభిమానంతో మీలో వాన చినుకులంత స్వచ్చంగా ఉప్పొంగిన భావ పరంపరలా అనిపిస్తుంది...

అవును స్వచ్చమైన భావ పరంపర!
ఎటువంటి భాషా భేషజాలు లేకుండా, అతి సహజంగా రాసిన కవిత...

Anonymous said...

you are simply :) the best :) nenevaroo nekenduku ley :) vadiley