ఆకాశంలో ఏదో స్వచ్చత
బాగా ఏడ్చేసి కళ్ళు తుడుచేసుకున్నట్టు.
రోడ్లూ , బళ్ళూ మాత్రం
పడిశం పట్టినట్టు తిరుగుతున్నాయి
మొత్తం మంచు మీదేసుకుని!
తెల్లకోట్లు వేసుకుని చెట్లు
నల్లకోట్లు వేసుకుని నాగరీకులు
ఈ తాత్కాలిత డిగ్రీలు మోయలేనట్టు
మొహం చాటింపు!!
అంతఃపురం లో సూరీడు
అనంత పయనంలో మబ్బులు
నా రైలు పెట్టెలో నేను
వింటర్ రాగాలు వింటూ!!
9 comments:
"ఆకాశంలో ఏదో స్వచ్చత
బాగా ఏడ్చేసి కళ్ళు తుడుచేసుకున్నట్టు."
ఇది సూపర్!! చివరి చరణం కూడా భలే వుంది, 'వింటర్ రాగాలు వింటూ' అంటూ :-)
వీలు చూసుకుని కొంచెం ఫ్రీక్వెంట్ గా రాసేయమ్మా, ప్లీజ్...
నీకు నీవే సాటి , నేనేవరైతే నేకేందుకు నువ్వు కుమ్మేస్తున్నావ్ లక్షిమీ
కీప్ రైటింగ్.....
మొత్తానికి, ఇన్ని రోజుల తర్వాత ఇక్కడ కనిపించారు.
కవిత బాగుందండి.
నాదీ కిరణ్ గారి కామెంటే... :)
బావున్నారా? మరింత తరచుగా రాయండి.
వావ్!
భలే భలే
మిడ్వెస్టు చలికాలప్పొద్దుని భలే పట్టేసుకున్నారు మీ చిన్ని చిన్ని మాటల్లో.
శెబాసో!!
మీ అందరికీ కృతజ్ఞతలు :-)
బావుంది. మీ శైలి కనపడుతోంది.
మీరు తెలుగు పీపుల్ లో లక్ష్మి తులసి గారని అనుకుంటున్నాను. నేను మీకు పే.ద్ద అభిమానిని. తెలుగు పీపుల్ లో మీ కవితలు చదివాక.,మీ బ్లాగ్ లేదా మీ ఇతర కవితలు ఎక్కడ దొరుకుతాయో అని తెగ వెతికాను అంతర్జాలమంతా
కవిత్వం అనగానే నాకు గుర్తొచ్చే వాటిలో మొదట మీ కవితలే ఉంటాయి. ముఖ్యంగా మీ వానకు తడిసిన రాత్రి చదివి ఇంత తేలిక పదాలతో ఇంత అందమయిన కవిత్వం చెప్పచ్చా అని ఎన్ని రోజులు అనుకున్నానో నాకే తెలియదు.
"వానకు తడిసిన రాత్రి" కవితను అంతలా గుర్తు పెట్టుకున్నందుకు నాలో ఆనందం ఆశ్చర్యం ఒకేసారి.
మీ అభిమానానికి చాలా థేంక్స్ వాసుగారు
Post a Comment