Wednesday, July 6, 2011

కాలం

కాలం
విచిత్రాలు చేస్తుందని
ఇప్పుడు
నమ్మక తప్పడం లేదు

ఆవలి తీరంలో
నాక్కావల్సినదేదో
ఆగిపోయిందనుకున్నా
వెతుకుతూనే వున్నా
వేసారిపోయి వున్నా


ఉన్నపళాన
ఉద్వేగభరిత క్షణాలలో
ఊరించింది
అంతే త్వరగా
తరుముకుంటూ పోయింది
ఊహలకు ఊపిరి పోస్తూ...!
జ్ఞాపకాలకు ప్రాణం అద్దుతూ...!


ఇక
కొత్త అధ్యాయం
మొదలయిందో, ముగిసిందో
తెలిసేది
మళ్ళీ మలుపు తిరిగాకే!
కాలం మెలిక వేశాకే!

2 comments:

Afsar said...

తులసి గారు;

మీ వెన్నెల వాన ఇప్పటి దాకా మిస్ అయ్యినందుకు సిగ్గుగా వుంది.

ఎలా మిస్ అయ్యానో తెలియదు.

చాలా కవితలు నాకు నచ్చాయి. సాధారణంగా కవిత్వంలో ఆబ్ స్ట్రాక్ట్ అంటే చాలా మోహం, వ్యామోహం. దానికి భిన్నంగా మీరు చాలా కాంక్రీట్ గా రాస్తున్నారని అనిపించింది.

చిన్న మాట- కవిగా ఇది మీరు చేయాలని కాదు కానీ, ప్రవాస భావన - మీరు ప్రవాసంలోనే వున్నారు కాబట్టి- కవిత్వంలోనూ వీలయితే వచనంలోనూ ఎక్కువగా వ్యక్తం కావాలని కోరుకుంటాను నేను. అనుభవాలలోని తేడా ప్రవాసంలో ఎక్కువగా చూస్తాం మనం. అటు వైపు వొక సారి దృష్టి సారించి చూడండి. అక్కడ మీ వ్యక్తీకరణ కూడా మారుతుందని నాకు అనిపిస్తోంది. ఇది మీ కవిత్వం చదివాక కలిగిన నా ఆలోచన మాత్రమే.

Mohanatulasi said...

అఫ్సర్ గారు
మీ కామెంట్ చూసాక మొదట ఎలా స్పందించాలో తెలీలేదు నిజంగా!
సంతోషంతో ఒక చిరునవ్వు, మీకు నా కవితలు నచ్చినందుకు!
అసలు కవిత్వంలో ఇన్ని రకాలు అంటూ పెద్దగా idea లేదు నాకు!
మనసుకు తోచింది, అనిపించింది పదాల్లోకి పెట్టాలనే కుతూహలం తప్ప.

మీరు చెప్పిన ఆఖరి వాక్యాలు తప్పకుండా గుర్తుపెట్టుకుంటాను.
నిన్నటి నుండి అవి అర్ధం చేసుకునే ప్రయత్నంలోనే వున్నాను. అందుకే నా రిప్లై లేట్. Thanks alot for your time on my blog Afsar ji.