Wednesday, August 17, 2011

నీకూ నాకూ మధ్య...!

నీకూ నాకూ
మధ్య
నిశ్శబ్ధం లాంటి ఓపొర
సమాజపు కట్టుబాటులా!
వ్యక్తీకరణలో లోటుపాటులా!

వినాలనివుంటుంది -
చెప్పలేక కట్టిపెట్టి
నే బంధించిన ఓ భావానికి
నువు పదాలు పేరిస్తే,
దాచిపెట్టినా దాగని
నీనవ్వులోని శబ్ధానికి
మరో అర్ధం వివరిస్తే!

ఏదో ఓ రోజు
ఎదురొచ్చే ఆ క్షణం
ఎలా వస్తుందో
అనిపించే గాఢతలో
ఇప్పుడు
ఈ క్షణం ఇలా...గమ్మత్తుగా!
గతించిన కాలానికి కొనసాగింపుగా!

3 comments:

వాసుదేవ్ said...

ఏం జరిగినా మంచికే అన్నట్లుగా మీ బ్లాగుని యాక్సిడెంటల్‌‌గా చూసినా మంచి కవిత్వం చదివాననే తృప్తి మిగిలింది. మీ రచనలు హాయిగా ఉన్నాయి. ఇది కూడా...

Mohanatulasi said...

Thank You Vasudev garu!

Anonymous said...

ఒక్కోసారి కట్టుబాటును దాటితే తప్ప నిజమైన బాట కనిపించదు.