Thursday, February 23, 2012

ఈపరధ్యానమెందుకో!?

నేనూ, వాతావరణం
ఒకేలా వున్నాము చల్లగా,చప్పగా!
సూర్యకిరణుని మృదుహాస్యం
పత్రహరిత దరహాసం
అందుకోనందుకా!!

తలమునకలయ్యే పనిలోనే వున్నా
అయినా తలెత్తినప్పుడల్లా,
పంచదార పలుకులాంటి సందేశం ఎటెళ్ళిందో
అంటూ ఓ చిన్న యోచన

భావచిత్రం పైన
చందనపు పూత పరిమళాలు
ఆశ రేకెత్తిస్తున్నాయి!

చుట్టూరా గోడలన్నీ
ఎంత గోముగా
గుర్తులన్నీ లెక్కకడుతున్నాయి

రాసుకున్న
అక్షరాల అతితెలివి కాకపోతే,
దాచుకున్న వాక్యాల వ్యాకరణమూ
ఇదే చెబుతుందేమిటి!

గడ్డానికి ఆంచుకున్న
చేతికి మాత్రం తెలుసేమిటి
ఈపరధ్యానమెందుకో!?

1 comment:

జ్యోతిర్మయి said...

ఈ పరధ్యానం ఎందుకో తెలిసిపోయింది. మీ కవిత్వం అత్భుతం తులసి గారు.